ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మార్పుల్లేవు


Wed,February 20, 2019 01:09 AM

Dave-Richardson
న్యూఢిల్లీ: పుల్వామా ఘటన నేపథ్యంలో.. వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలపై ఐసీసీ స్పందించింది. ఇప్పటికైతే షెడ్యూల్‌లో ఎలాంటి మార్పుల్లేవని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్‌సన్ స్పష్టం చేశారు. యధావిధిగానే అన్ని మ్యాచ్‌లు జరుగుతాయన్నాడు. మెగా ఈవెంట్‌లో మ్యాచ్‌లు రద్దు చేసుకుంటున్న సంకేతాలైతే మాకు లేవు. ఉగ్రదాడి జరుగడం దురదృష్టకరం. ఈ ఘటనలో మరణించిన జవాన్లకు సంతాపం తెలియజేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులను మా సభ్య దేశాల బోర్డులతో కలిసి సమీక్షిస్తున్నాం. క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్‌కు అందర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే సత్తా ఉంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే మేం సభ్య దేశాలతో చర్చలు జరుపుతున్నాం అని రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు.

పుల్వామా సంఘటన తర్వాత యావత్ దేశం.. పాక్‌తో మ్యాచ్‌లు ఆడొద్దని ముక్తకంఠంతో వ్యాఖ్యానించింది. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ అయితే వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకున్నా.. కప్ గెలిచి సత్తా టీమ్‌ఇండియాకు ఉందని కుండబద్దలుకొట్టాడు. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా పాక్‌తో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని తేల్చడంతో ప్రపంచకప్ మ్యాచ్‌పై సందేహాలు మొదలయ్యాయి.

597

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles