2018లో టీ20 వరల్డ్‌కప్ లేదు


Mon,June 19, 2017 02:08 AM

లండన్: క్రికెట్ అభిమానులను ఒకింత నిరాశ కల్గించే వార్త. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను 2020కి వాయిదా వేశారు. 2018లో టాప్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నందున ప్రపంచకప్‌ను నిర్వహించడం లేదని తెలిసింది. దీన్ని ఐసీసీలోని అత్యున్నత వర్గాలు కూడా ధృవీకరించాయి. అవును 2018 టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నాం. ఇప్పటి వరకు వేదిక కూడా ఇంకా ఖరారు కాలేదు. సభ్యదేశాల జట్ల మధ్య పలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండటమే వాయిదాకు ప్రాథమిక కారణం. అందువల్లే 2018లో ప్రపంచకప్ షెడ్యూల్ సాధ్యపడటం లేదు అని ఐసీసీ పేర్కొంది.

449

More News

VIRAL NEWS