ఫార్ములావన్ దిగ్గజం నిక్కీ కన్నుమూత


Wed,May 22, 2019 02:49 AM

Niki-Lauda
వియన్నా: ఫార్ములావన్ దిగ్గజం నిక్కీ లాడా ఈ లోకాన్ని వీడారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న నిక్కీ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఫార్ములావన్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న ఈ 70 ఏండ్ల ఆస్ట్రియా రేసర్ తన కెరీర్‌లో మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ దక్కించుకున్నాడు. అయితే 1976 జర్మనీ గ్రాండ్‌ప్రి రేసులో తీవ్రంగా గాయపడ్డ నిక్కీ ఆ మరుసటి ఏడాదే చాంపియన్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నిక్కీ..40 రోజుల తేడాతో మళ్లీ ట్రాక్‌పై అడుగుపెట్టాడు. బ్రిటిష్ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్‌ను ఫార్ములావన్ కెరీర్ వైపు తీసుకురావడంలో ఈ దిగ్గజానిది వెలకట్టలేని పాత్ర.

163

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles