‘టాప్స్‌’కు నిఖత్ జరీన్ ఎంపిక


Thu,September 12, 2019 04:58 AM

nikhat
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటుతున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్(టాప్స్)కు ఎంపికైంది. ఆమెతోపాటు తెలుగు షట్లర్ సాయి ప్రణీత్, స్టార్ బాక్సర్ మేరీకోమ్ సహా మొత్తం 12మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించగలరని అనుకున్న ప్లేయర్లను గుర్తిం చి, వారికి ఆర్థిక పరమైన ప్రోత్సాహంతో పాటు ప్రత్యేక శిక్షణ, ప్రపంచస్థాయి సదుపాయాలను కేంద్ర క్రీడా, యువజన మంత్రిత్వ శాఖ టాప్ పథకం కింద కల్పిస్తున్నది. 2015లో జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి న నిఖత్.. అంతర్జాతీయ టోర్నీల్లోనూ సత్తా చాటుతున్నది. దీంతో మరింత ప్రోత్సాహం అందిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధిస్తుందని గుర్తించిన ప్రభుత్వం టాప్స్‌కు ఎంపిక చేసిం ది.

sai
మరోవైపు గత నెల జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయి ప్రణీత్ కాంస్య పతకం కైవసం చేసుకొని, 36ఏండ్లలో పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పోటీలకు దేశం తరఫున ఒక్కో విభాగంలో ఇద్దరు ప్లేయర్లను బరిలోకి దింపే అవకాశముంది. దీంతో ఈసారి ప్రణీత్‌కు ఛాన్స్ దక్కొచ్చు.

270

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles