ఫైనల్లో నిఖత్ జరీన్


Tue,February 19, 2019 01:54 AM

nikhat1
న్యూఢిల్లీ: 70వ స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పంచ్ పవర్ చాటింది. వరల్డ్‌కప్ జూనియర్ విభాగం మాజీ చాంపియన్ నిఖత్ 51 కేజీల విభాగంలో సోమవారం జరిగిన సెమీస్‌లో విజయంతో స్వర్ణపతక పోరుకు అర్హత సాధించింది. పోలండ్ బాక్సర్ సాండ్రా డ్రాబిక్‌పై 3-2 స్కోరుతో విజయాన్నందుకుంది. గాయం నుంచి కోలుకున్న అనంతరం రింగ్‌లో వరుస విజయాలతో దూసుకెళుతున్న నిఖత్ మరోసారి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుని స్వర్ణం కోసం పోటీ పడనుంది. సోమవారం జరిగిన ఇతర బౌట్లలో 48 కేజీల విభాగంలో మంజురాణి సహా నాగాలాండ్ బాక్సర్ మీనాకుమారి(54కేజీలు) ఫైనల్ చేరారు. పురుషుల విభాగంలో పోటీలో నిలిచిన ఏకైక బాక్సర్ అమిత్ పంగల్ హోరాహోరీ పోరాటంతో 49 కేజీల విభాగం సెమీస్‌లో మోర్టాజీని ఓడించాడు. మరోవైపు మహిళల విభాగంలో హర్యానా బాక్సర్ నీరజ్(60కేజీలు), లోవ్లీనా(69 కేజీలు), పివాలో బసుమటరీసెమీస్‌లో ఓడి కాంస్యా లు దక్కించుకున్నారు. కాగా, నిఖత్ సహా మరో ఇద్దరు మహిళా బాక్సర్లు, అమిత్ పంగల్ ఫైనల్ చేరడంతో ఈ టోర్నీలో భారత్‌కు 7 పతకాలు ఖాయమయ్యాయి.

273

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles