రెండో రౌండ్‌లో నిఖత్


Mon,July 22, 2019 02:46 AM

boxing
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ దూసుకెళ్తున్నది. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీ 51 కేజీల విభాగంలో నిఖత్ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. మాజీ జూనియర్ వరల్డ్ చాంపియన్ నిఖత్ తొలి రౌండ్‌లో 5-0తో టస్మిన్ బెన్నీ (న్యూజిలాండ్)ను చిత్తు చేసింది. మరో భారత బాక్సర్ శశి చోప్రా (60 కేజీలు) తొలి రౌండ్‌లో సుడాపోన్ సీసొండీ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

317

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles