తడబడ్డ ఇంగ్లండ్


Wed,November 6, 2019 12:22 AM

10 పరుగుల తేడాలో 5 వికెట్లు కోల్పోయి కివీస్ చేతిలో ఓడిన మోర్గాన్ సేన
nz
నెల్సన్: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ జోరు కొనసాగిస్తున్నది. తొలి మ్యాచ్ ఓడిన ఆతిథ్య జట్టు ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అనూహ్యంగా తడబడ్డారు. 10 పరుగుల వ్యవధిలో కీలకమైన ఐదుగురు ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ ఔటవడంతో.. న్యూజిలాండ్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్య ఛేదనలో 15 ఓవర్లకు ఇంగ్లండ్ 139/2తో నిలిచింది. పర్యటక జట్టు గెలువాలంటే 31 బంతుల్లో 42 పరుగులు చేయాలి. భారీషాట్లతో జోరు మీదున్న విన్స్ (49), కెప్టెన్ మోర్గాన్ (18) క్రీజులో ఉన్నారు.

ఇంకేముంది ఇంగ్లండ్ విజయం నల్లేరుపై నడకే అనుకుంటే.. అద్భుతంగా పుంజుకున్న న్యూజిలాండ్ బౌలర్లు వరుస వికెట్లతో పర్యటక జట్టు భరతంపట్టారు. ఫలితంగా.. 10 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లిష్ జట్టు లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మలన్ (55) అర్ధశతకం సాధించగా.. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్, టిక్నెర్ చెరో 2 వికెట్లు పడగొట్టా రు. అంతకుముందు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గ్రాండ్‌హోమ్ (55; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గప్టిల్ (33) రాణించడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది.

366

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles