క్రికెట్ బంతుల్లో మైక్రోచిప్‌లు


Tue,August 13, 2019 01:46 AM

kokaburra
మెల్‌బోర్న్ : ఇటీవలి కాలంలో క్రికెట్‌లో సాంకేతికత కీలకంగా మారింది. నూతన ఆవిష్కరణలు ఎన్నో వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగం గా క్రికెట్ బంతులు త్వరలో స్మార్ట్‌గా మారనున్నాయి. మైక్రోచిప్‌లతో కూడిన బంతులను ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన కూకబుర్రా సంస్థ తయారు చేసి, పరీక్షిస్తున్నది. వచ్చే వేసవిలో జరిగే ఆసీస్ టీ20 లీగ్ బిగ్‌బాష్‌లో వీటిని ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ స్మార్ట్ బంతులు... బౌలర్ బంతిని విడిచే స్థానం దగ్గర నుంచి వేగం, బౌన్స్ తదితర అంశాలను సాధారణ రాడార్ కన్నా మరింత కచ్చితత్వంతో అందిస్తాయని కూకబుర్రా ప్రకటించింది. ఈ బంతు లు అంపైర్ నిర్ణయ సమీక్ష(డీఆర్‌ఎస్)లోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే క్యాచ్‌ల విషయంలో నిర్ణయం కష్టమైనప్పుడూ సహకరిస్తాయి. ఈ స్మార్ట్‌బాల్స్.. చూసేందుకు సాధారణ కూకబుర్రా బంతుల్లాగే ఉంటాయి.

1081

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles