నంబర్ 1 మేరీ కోం..


Fri,January 11, 2019 03:07 AM

image
న్యూఢిల్లీ: ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత స్టార్ బాక్సర్ మేరీ కోం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. గతేడాది ఢిల్లీలో ముగిసిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీ 48 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ బాక్సింగ్ సంస్థ(ఏఐబీఏ) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ చేజిక్కించుకుంది. బాక్సింగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బాక్సర్‌గా కొత్త చరిత్ర నమోదు చేసిన మేరీ 48 కేజీల విభాగంలో ఈ ఏడాదికి గాను 1700 పాయింట్లు సాధించింది. 48 కేజీల విభాగాన్ని చేర్చకపోవడంతో 2020లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో 51 కేజీల విభాగంలో మేరీ కోం తలపడనుంది. 2018 ఏడాదిని విజయంవంతంగా కొనసాగించిన మేరీ కోం.. పోలండ్ టోర్నీతోపాటు కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు కైవసం చేసుకుంది. బల్గేరియాలో జరిగిన టోర్నీలోనూ రజతం నెగ్గింది. ఇతర మహిళా బాక్సర్లలో పింకీ జాంగ్రా (51కేజీలు), ఆసియా క్రీడల రజత పతక విజేత మనీశ్ మౌన్(54కేజీలు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇండియా ఓపెన్‌లో స్వర్ణం గెలుచుకున్న లోవ్లీనా(69కేజీల)విభాగంలో రెండోస్థానం అందుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న సిమ్రన్‌జిత్ కౌర్(64కేజీలు) నాలుగోస్థానం దక్కించుకుంది.

304

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles