పసిడి త్రయం సర్జుబాల, సోనియా, సరితకు స్వర్ణాలు


Sat,January 13, 2018 03:07 AM

saritha
రోహ్‌తక్: జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సర్జుబాల దేవి, సోనియా లాథర్, సరితా దేవి స్వర్ణాలతో మెరిశారు. శుక్రవారం జరిగిన 48 కేజీల ఫైనల్లో సర్జుబాల (మణిపూర్) 3-2తో రీతూ పై గెలిచింది. దీంతోపాటు ఉత్తమ బాక్సర్ అవార్డునూ సొంతం చేసుకుంది. 60 కేజీల టైటిల్ పోరులో సరితా దేవి (ఏఐపీ).. పవిత్రను ఓడించింది. 57 కేజీల విభాగం ఫైనల్లో సోనియా (ఆర్‌ఎస్‌పీబీ) 5-0తో ప్రపంచ యూత్ చాంపియన్ శశి చోప్రాపై గెలిచింది. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ) ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. 54 కేజీల్లో మీనా కుమారి, 48 కేజీల కేటగిరీలో రాజేశ్ నర్వల్, 75 కేజీల్లో పూజ రాణి పసిడి పతకాలను సాధించారు.

197

More News

VIRAL NEWS