మరో రెండేండ్లలో అన్ని హంగులతో జాతీయ క్రికెట్ అకాడమీ


Sat,May 20, 2017 12:40 AM

న్యూడిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు అన్ని ఆటంకాలు తొలిగాయని బీసీసీఐ తాత్కాలికి అధ్యక్షుడు సీకే ఖన్నా తెలిపారు. రాబోయే రెండేండ్లలో జాతీయ అకాడమీ నిర్మాణం పూర్తవుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించిన బీసీసీఐ తోపాటు కర్ణాటక ప్రభుత్వానికి అభినందనలు. సమస్యకు పరిష్కారం లభించడంలో చొరవచూపిన అమితాబ్ చౌదరికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఖన్నా పేర్కొన్నారు. మరో 25 ఎకరాల స్థలాన్ని బీసీసీఐ కేటాయించిన అనంతరం అంతర్జాతీయ హంగులతో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. తొలుత ఈ నిర్మాణం కోసం 2013లో ఒప్పందం చేసుకోగా అది చట్టవిరుద్ధమని కర్ణాటక హైకోర్టు కొట్టేయడంతో అకాడమీ పనులు ఆగిపోయాయి.

141

More News

VIRAL NEWS