కోహ్లీ నీ సవాల్ స్వీకరిస్తున్నా


Fri,May 25, 2018 12:29 AM

narendra-modi
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశ ప్రధాని నరేంద్రమోదీకి ఫిట్‌నెస్ సవాల్ విసిరాడు. ఈ సవాలును స్వీకరించిన ఆయన త్వరలోనే ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంటానని చెప్పారు. ఫిట్‌నెస్ సవాల్ ఏంటీ దేశ ప్రధాని కూడా ఆమోదించడం వెనుకాల ఆసక్తిని కలిగించే విషయం దాగుంది. ఐస్ బకెట్ చాలెంజ్ తరహాలో భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర క్రీడలమంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ అనే చాలెంజ్‌ను రెండురోజుల కిందట మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఆయనే స్వయంగా పది పుషప్స్ చేసిన వీడియోను పోస్టు చేస్తూ విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్, హృతిక్ రోషన్‌లకు సవాల్ విసిరారు. తాజాగా రాథోడ్ సవాల్‌ను కోహ్లీ స్వీకరించాడు. ఫిట్‌గా ఉండేందుకు చేస్తున్న కసరత్తులకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ తన భార్య అనుష్కశర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, భారత మాజీ కెప్టెన్ ధోనీలను ఈ సవాల్ స్వీకరించాలంటూ కోరాడు. నీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను. అతి త్వరలోనే నా ఫిట్‌నెస్ వీడియోను పంచుకుంటాను అని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ సవాల్ వైరల్‌గా మారింది.

502

More News

VIRAL NEWS