ముంబై 228 ఆలౌట్ గుజరాత్‌తో రంజీ ఫైనల్

Wed,January 11, 2017 12:27 AM

ఇండోర్: ముంబై, గుజరాత్ మధ్య మొదలైన రంజీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతున్నది. టాస్ గెలిచిన గుజరాత్.. డిఫెండింగ్ చాంపియన్ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ టీనేజ్ బ్యాటింగ్ సంచలనం పృథ్వీషా(93 బంతుల్లో 71) బాధ్యతాయుత అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. షాకు తోడు మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ (57) ఇన్నింగ్స్‌తో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. వీళ్లిద్దరు కలిసి మూడోవికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మైదా నం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించిన 17ఏండ్ల పృథ్వీ..రంజీ ఫైనల్లో అర్ధసెంచరీ చేసిన అతి పిన్నవయస్సు ఆటగానిగా రికార్డుల్లోకెక్కాడు. సీనియర్ పేసర్ ఆర్పీసింగ్(2/48), గాజ(2/46), భట్(2/5) విజృంభణతో ముంబై జట్టులో షా, యాదవ్ మినహా మిగతా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన గుజరాత్ ఆటముగిసే సరికి వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది. సమిత్ గోహెల్(2), పంచల్ (0) క్రీజులో ఉన్నారు.

272

More News

మరిన్ని వార్తలు...