సెలెక్షన్ కమిటీకి పొడిగింపు లేనట్లే!


Fri,August 10, 2018 12:29 AM

msk-prasad
న్యూఢిల్లీ: ఎంఎస్‌కే ప్రసాద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల జాతీయ సెలెక్షన్ కమిటీకి పదవి గండం ముంచుకొస్తున్నది. బీసీసీఐ కొత్త రాజ్యాంగ ముసాయిదా అధికారికంగా అమల్లోకి వస్తే ఈ కమిటిని పొడిగించే అవకాశాల్లేవని తెలుస్తున్నది. సీనియర్, జూనియర్ మహిళల జట్ల ఎంపిక కోసం ఐదుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీని కొనసాగించాలని సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో... వీళ్లను తొలగించి కొత్త ప్యానెల్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే టెస్టులు ఆడిన వారికే ప్యానెల్‌లో చోటు కల్పించాలన్న నిబంధనను ధర్మాసనం మార్చలేదు. దీంతో కొత్త ప్రతిపాదిక ప్రకారం సెలెక్షన్ కమిటీ సభ్యుడు 7 టెస్టులు, 10 వన్డేలు, 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. కొత్త ప్యానెల్‌ను ఎంపిక చేసే బాధ్యతను క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ)కి అప్పగించనున్నారు. పాత రాజ్యాంగం ప్రకారం ఎంపిక చేసిన ప్రసాద్, దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్‌ల కమిటీని కొనసాగించే అవకాశాల్లేవని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ వరకు వీళ్లను కొనసాగించి, ఆ తర్వాత కొత్త ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తారన్నారు. ఎందుకంటే కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిందంటే పాత కమిటీలన్నీ రద్దు అయిపోతాయని చెప్పారు.

220

More News

VIRAL NEWS

Featured Articles