సచిన్ రికార్డుకు చేరువలో మహీ..


Tue,January 22, 2019 12:01 AM

ఆక్లాండ్: భారత్ సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డు చేరువయ్యాడు. ఫామ్‌లేమితో జట్టుకు భారంగా మారాడనుకున్న ధోనీ..తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో మెరుపులు మెరిపించాడు. గతాన్ని గుర్తుకుతెస్తూ హ్యాట్రిక్ అర్ధసెంచరీలతో విరుచుకుపడ్డ ధోనీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ప్రపంచకప్ మెగాటోర్నీకి ముందు ఫామ్‌లోకి వచ్చిన మహీ.. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో మొదలయ్యే వన్డే సిరీస్‌లో అదే జోరు కనబర్చాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు కివీస్ గడ్డపై 10 మ్యాచ్‌ల్లో 456 పరుగులు చేశాడు. అయితే పరుగుల పరంగా సచిన్(18 మ్యాచ్‌ల్లో 652), సెహ్వాగ్(12 మ్యాచ్‌ల్లో 598) తర్వాతి స్థానంలో ధోనీ ఉన్నాడు. సచిన్ రికార్డును అందుకోవడానికి ఇంకా 197 పరుగుల దూరంలో ఉన్నాడు. కివీస్‌తో ఐదు వన్డేల్లో రాణిస్తే ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరినట్లే.

270

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles