భారత్ ఓటమిని తట్టుకోలేక..


Fri,July 12, 2019 02:59 AM

ఖానాకుల్/భవానీపట్నా: ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిని తట్టుకోలేక ఒకరు మృతి చెందగా, మరొకరు ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కివీస్‌తో మ్యాచ్‌లో ధోనీ రనౌట్ కావడాన్ని మొబైల్‌లో చూసిన పశ్చిమబెంగాల్‌కు చెందిన శ్రీకాంత్ మైతీ గుండెపోటుతో బుధవారం మరణించాడు. సెమీస్ మ్యాచ్ చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన దగ్గరలోని రూరల్ దవాఖానకు తరలించినా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఒడిశా కలహండి జిల్లాకు చెందిన సంబ్రు బోయి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

240

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles