ధోనీ @ 10000


Sun,January 13, 2019 02:04 AM

dhoni
భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి చేరింది. తన అసమాన నాయకత్వశైలి, బ్యాటింగ్ నైపుణ్యంతో జట్టుకు చిరస్మరణీయ విజయాలందించిన ధోనీ అరుదైన రికార్డును అందుకున్నాడు. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మహీ రికార్డుల్లోకెక్కాడు. శనివారం ఆస్ట్రేలియాతో తొలి వన్డే మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు. వాస్తవానికి 10వేల పరుగులను 2017లోనే అందుకున్నా..అందులో ఆసియా ఎలెవన్ తరఫున 174 పరుగులు ఉండటంతో రికార్డు పూర్తి కాలేదు. తాజా ప్రదర్శనతో సచిన్, గంగూలీ, ద్రవిడ్, కోహ్లీ తర్వాత ధోనీ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ రికార్డు అందుకున్న 13వ క్రికెటరయ్యాడు.

381
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles