మాలావత్ పూర్ణ అరుదైన ఘనత


Sun,February 17, 2019 01:36 AM

నాలుగు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలు అధిగమించిన
అతిపిన్న వయసు బాలికగా రికార్డు


malavath-poorna

హైదరాబాద్: తెలంగాణ గిరిజన బిడ్డ మాలావత్ పూర్ణ అరుదైన ఘనత అందుకుంది. నా లుగు ఖండాల్లోని అతి ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయసు బాలికగా కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ నెల 15న దక్షి ణ అమెరికా ఖండం ఆండీస్ పర్వతాల శ్రేణిలోని అత్యున్నత శిఖరం మౌంట్ అకోంకాగువాను అధిరోహించింది. ఇప్పటికే మలావత్ పూర్ణ మౌంట్ ఎవరెస్ట్(నేపాల్, ఆసియా), కిలిమంజారో(టాంజానియా, ఆఫ్రికా), ఎల్‌బ్రస్(రష్యా, యూరప్) పర్వతాలను అధిరోహించింది. మౌండ్ అకోంకాగువా శిఖరాగ్రాన జాతీయజెండాను ప్రదర్శించింది. మిగిలిన మూడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించి దేశానికి, రాష్ర్టానికి పేరు తీసుకువస్తానని మలావత్ పూర్ణ తెలిపింది. ధైర్యసాహసాలతో ఒక్కో లక్ష్యాన్ని అధిగమిస్తున్న పూర్ణను గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందించారు. షెడ్యూల్డ్ గురుకుల పాఠశాలలోనే పూర్ణ చదువును కొనసాగిస్తున్నది.

314

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles