మోర్గాన్‌పై సస్పెన్షన్


Thu,May 16, 2019 03:58 AM

morgan
ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై వేటు పడింది. పాకిస్థాన్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడినందుకు మోర్గాన్‌పై ఒక వన్డే నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధిస్తూ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ నిర్ణయం తీసుకున్నాడు. మోర్గాన్‌కు తోడు జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడనుంది. ఏడాది కాలంలో రెండోసారి స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడినందుకు మోర్గాన్‌పై మ్యాచ్ నిషేధం విధించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో శుక్రవారం నాటింగ్‌హామ్ వేదికగా పాక్‌తో జరిగే నాలుగో వన్డేకు మోర్గాన్ దూరమయ్యాడు. మరోవైపు ఔటైన తర్వాత వికెట్లను కొట్టిన జానీ బెయిర్‌స్టో మందలింపునకు గురికావడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ విధించారు.

278

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles