మాకొద్దీ లిబ్రా కాయిన్


Sun,October 13, 2019 01:19 AM

-ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీకి దూరమైన మరిన్ని సంస్థలు

శాన్‌ఫ్రాన్సిస్కో, అక్టోబర్ 12: ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ.. మరిన్ని సంస్థలకు దూరమైంది. ప్రతిపాదిత ఈ లిబ్రా క్రిప్టోకరెన్సీపై ప్రపంచవ్యాప్తంగా రెగ్యులేటర్ల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీసా, మాస్టర్‌కార్డ్, ఈబే, స్ట్రీపే తదితర సంస్థలు లిబ్రా అసోసియేషన్‌లో సభ్యత్వాన్ని విరమించుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసోసియేషన్‌లో చేరాలనుకోవడం లేదని ఓ ఈ-మెయిల్‌లో క్రెడిట్ కార్డ్ దిగ్గజం మాస్టర్ కార్డ్ తెలిపింది. మరో క్రెడిట్ కార్డ్ దిగ్గజ సంస్థ వీసా సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నామని, నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ లిబ్రాతో భాగస్వామ్యంపై సమాధానాన్ని దాటవేసింది. ఇక లిబ్రా అసోసియేషన్ లక్ష్యాలను తాము గౌరవిస్తామని అంటూనే.. సంఘంలో వ్యవస్థాపక సభ్యత్వంపై పునరాలోచిస్తామని స్పష్టం చేసింది. మరికొన్ని సంస్థలూ ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

131

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles