హెచ్‌సీఏ సెలక్షన్ ప్రక్రియను పర్యవేక్షించండి


Thu,September 13, 2018 01:05 AM

-పరిపాలన కమిటీకి ఉమ్మడి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తరఫున ఆటగాళ్ల ఎంపికను నిర్వహించేందుకు సెలక్షన్ ప్రక్రియనూ పర్యవేక్షించాలని హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటర్స్ కమిటీకి ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రంజీ ట్రోఫీ బీసీసీఐ నిబంధనలమేరకు నిర్వహించే టోర్నీలకు రాష్ట్ర జట్లు ఎంపికలో నిజాయతీ కలిగిన సెలక్టర్ల సహకారంతో హెచ్‌సీఏ జట్లను ఎంపిక చేయాలని పేర్కొంది. హెచ్‌సీఏ పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అనిల్ రమేశ్ దవే, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతి, ప్రొఫెసర్ రత్నాకర్ శెట్టితో కూడిన కమిటీని గత ఏడాది మార్చి నెలలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బుధవారం మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం గత ఏడాది ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ ఆధ్వర్యంలోనే హెచ్‌సీఏ పరిపాలన వ్యవహారాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. హెచ్‌సీఏ కొత్త బైలాస్‌ను రూపొందించడమే కాకుండా ఎన్నికలను నిర్వహించే బాధ్యతను సైతం అడ్మినిస్ట్రేటర్స్ కమిటీకి హైకోర్టు అప్పగించింది.

450

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles