షమీ.. దక్షిణాఫ్రికా పర్యటన వివరాలు ఇవ్వండి


Tue,March 13, 2018 04:05 AM

బీసీసీఐకి కోల్‌కతా పోలీసుల లేఖ

Fire.mohammed-shami
కోల్‌కతా: భార్యతో విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చూస్తున్న భారత సూపర్ పేసర్ మహ్మద్ షమీపై కోల్‌కతా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షమీ దక్షిణా పర్యటన వివరాలు తెలుపాలంటూ కోల్‌కతా పోలీసులు బీసీసీఐకి లేఖ రాశారు. షమీ దుబాయ్ నుంచి భారతజట్టుతో కలిసాడా లేదంటే పర్యటన అనంతరం దుబాయ్ వెళ్లాడా అన్న వివరాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ అతని పర్యటన బీసీసీకి సంబంధించినదా లేదా వ్యక్తిగతమైనదా కూడా సమాచారం తెలుపాలని పోలీసులు కోరారు. కాగా, మరోవైపు తన భార్య హసీన్‌తో అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని షమీ భావిస్తున్నాడు. ఈ మేరకు హసీన్ న్యాయవాదితో సంప్రతింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

264

More News

VIRAL NEWS