మిథాలీ @20 ఏండ్లు


Thu,October 10, 2019 12:31 AM

Mithali
గత నెలలో పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఈ మ్యాచ్‌తో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అరంగేట్రం చేసిన తర్వాత రెండు దశాబ్దాలుగా (20 ఏండ్ల 105 రోజులు) ఆటలో కొనసాగుతున్న మహిళా ప్లేయర్‌గా మిథాలీ చరిత్రకెక్కింది. 1999లో భారత్‌ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన హైదరాబాదీ మిథాలీ ఇప్పటి వరకు 204 వన్డేలు, 10 టెస్టులు, 89 టీ20లు ఆడింది. మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్‌గానూ మిథాలీ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ చార్లొట్‌ ఎడ్వర్ట్స్‌ (191), జులన్‌ గోస్వామి (178) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

257

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles