మీరాబాయికి స్వర్ణం


Wed,July 10, 2019 02:50 AM

Saikhom-Mirabai-Chanu
ఏపియా(సమోవా): కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ను భారత్‌ ఘనంగా ఆరంభించింది. మంగళవారమిక్కడ ప్రారంభమైన సీనియర్‌ మహిళల పోటీ(49కేజీల విభాగం)లో భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మీరాబాయి మొత్తం 191 కేజీల(84+107)ను ఎత్తి సత్తా చాటింది. అలాగే టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించడం సహా అవకాశాలను మెరుగుపరుచుకుంది. చానూ స్వర్ణం సహా సీనియర్‌, జూనియర్‌, యూత్‌ విభాగాల్లో భారత ప్లేయర్లు మొత్తం 13 పతకాలను దక్కించుకున్నారు. అందులో ఎనిమిది స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. సీనియర్‌ మహిళల 45 కేజీల విభాగంలోనే 154 కేజీలు ఎత్తి జిల్లి దల్‌బెహ్రా స్వర్ణాన్ని, 55 కేజీల సీనియర్‌ విభాగంలో వింధ్యారాణి దేవి పసిడిని, తెలుగమ్మాయి మత్స్య సంతోషి రజతాన్ని చేజిక్కించుకుంది. సీనియర్‌ పురుషుల 55కేజీల విభాగంలో రిషికంఠ సింగ్‌ మొత్తం 235 కేజీలు(105+130) ఎత్తి స్వర్ణ పతకాన్ని చేజిక్కుంచుకున్నాడు.

200

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles