కళంకితుల పదవులు రద్దు


Wed,January 11, 2017 12:39 AM

-నిర్ణయాన్ని మార్చుకున్న ఐవోఏ
KALMADI
న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ), క్రీడాశాఖ మధ్య నడుస్తున్న వివాదానికి తెరపడింది. కళంకితులైన సురేశ్ కల్మాడీ, అభయ్‌సింగ్ చౌతాలను జీవితకాల అధ్యక్షులుగా ఎంపిక చేసిన ఐవోఏ తమ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంది. కళంకితులకు అత్యుత్తమ పదవులను కట్టబెట్టడాన్ని తప్పుపట్టిన క్రీడాశాఖ.. నిర్ణయాన్ని మార్చుకునేంత వరకు ఐవోఏపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రీడాశాఖ నుంచే గాకుండా అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో ఐవోఏ కాళ్ల బేరానికి రాక తప్పలేదు. సోమవారం క్రీడాశాఖతో సమావేశమైన తర్వాత కల్మాడీ, చౌతాలను పదవుల నుంచి తొలిగిస్తున్నట్లు ఐవోఏ అధ్యక్షుడు రామచంద్రన్ పేర్కొన్నారు. వాళ్లిద్దరి నియామకాలను ఐవోఏ రద్దు చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను చూశాను. దేశంలో క్రీడల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఐవోఏ తీసుకున్న పునఃసమీక్ష నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నాను అని కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయల్ అన్నారు.

272
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS