మీ కుటుంబ సభ్యుల ఖర్చు మీదే


Thu,March 22, 2018 12:58 AM

అథ్లెట్లు, ఇతర సిబ్బందికి ఐవోఏ ఝలక్
న్యూఢిల్లీ: కామన్‌వెల్త్ గేమ్స్‌కు వెళ్లే అథ్లెట్లకు భారత ఒలింపిక్ సమాఖ్య (ఐవోఏ) చేదు వార్త చెప్పింది. ఈ మెగాటోర్నీకి అథ్లెట్లు, కోచ్‌లు, టీమ్ మేనేజర్‌ల కుటుంబ సభ్యులను ఈసారి అనుమతించబోమని అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ క్రీడాకారులు గానీ, ఇతర సిబ్బంది గానీ వారి కుటుంబ సభ్యులను వెంట తీసుకుపోవాలనుకుంటే ఆ ఖర్చును వారే భరించాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఏ మాత్రం భరించదని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి 222 మంది అథ్లెట్లు, 106 మంది అధికారులు, 57 మంది కోచ్‌లు, 19 మంది మేనేజర్లు, 41 మంది ఇతరత్రా సిబ్బంది జాబితాను భారత ఒలింపిక్ సమాఖ్య క్రీడాశాఖకు పంపింది. క్రీడా మంత్రి రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్ దీనిపై మరో రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తారు. 2014 గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రీడాకారుల కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చుల కోసం భారత ప్రభుత్వం రూ.1.75లక్షలు వెచ్చించిందని. దీనిపై అప్పట్లో విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఐవోఏ ప్రతినిధి తెలిపారు. అథ్లెట్ల కుటుంబ సభ్యుల కోసం ప్రభుత్వం ఎందుకు ఖర్చుపెట్టాలి అని ప్రశ్నించారు.

396
Tags

More News

VIRAL NEWS