మీనా పసిడి పంచ్


Sun,April 14, 2019 02:45 AM

-బాక్సింగ్ ప్రపంచకప్
meena
న్యూఢిల్లీ: కోలోగ్నె బాక్సింగ్ ప్రపంచకప్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. టోర్నీలో ఐదు పతకాలతో సత్తాచాటారు. శనివారం జరిగిన మహిళల 54కిలోల బౌట్ ఫైనల్లో మీనా కుమారి.. మచాయి బున్యానుత్(థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన టైటిల్ ఫైట్‌లో పాయింట్ల ఆధారంగా ఈ మణిపూరి బాక్సర్ విజేతగా నిలిచింది. తన విభాగంలో పోటీదార్లు తక్కువగా ఉండటంతో నేరుగా ఫైనల్ ఆడిన మీనా కుమారి..మరోమారు పసిడి పతకంతో మెరిసింది. ఆసియా చాంపియన్‌షిప్(2014) కాంస్య విజేత అయిన మీనా..ఇటీవలే జరిగిన ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా కప్‌లో నూ స్వర్ణ పతకం సాధించింది. మరోవైపు సాక్షి(57కి), పిలావో బాసుమత్రి(64కి) రజత పతకాలతో సంతృప్తిపడ్డారు. పింకీ రాణి(51కి), పర్వీన్(60కి) కాంస్య పతకాలు దక్కాయి.

152

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles