ధోనీది ఒక శకం: హేడెన్


Mon,May 13, 2019 02:41 AM

చెన్నై: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసలతో ముంచెత్తాడు. క్రికెట్‌లో ధోనీది ఒక శకమని, దేశానికి అత నో నాయకునిలాంటివాడంటూ హేడెన్ ఆకాశానికెత్తాడు. ముంబైతో ఐపీఎల్ ఫైన ల్ మ్యాచ్‌కు ముందు ద సూపర్ కింగ్స్ షో పేరిట నిర్వహించిన కార్యక్రమంలో హేడెన్ మాట్లాడాడు. ధోనీ మామూలు ఆటగాడు కాదు క్రికెట్‌లో అతనిదో శకం. గల్లీ క్రికెట్ జట్టుకు ఎంఎస్ ఒక కెప్టెన్‌గా వ్యవహరించినట్లు ఉంటుంది. జట్టులో ఒకనిగా..అందరితో కలిసిపోతూ ఏదైనా చేయడంలో ముందుంటాడు. మ్యాచ్ కోసం అతను సన్నద్ధమయ్యే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. బౌలింగ్‌కు తగ్గట్లు బ్యాట్స్‌మెన్ కొట్టే షాట్లను ముందే అం చనా వేస్తూ ఫీల్డింగ్ చేయడంలో ధోనీది అందవేసిన చేయి. ఆటగాళ్ల నుంచి కావాల్సిన దాన్ని రాబట్టుకోవడంలో నేర్పరి అని హేడెన్ అన్నాడు.

306

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles