సెమీస్‌లో మేరికోం X నిఖత్


Wed,May 22, 2019 02:58 AM

-కనీసం కాంస్య పతకం ఖాయం
-ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీ

Mary-Kom
గువాహటి: ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, స్టార్ బాక్సర్ మేరికోం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన 51కిలోల క్వార్టర్స్‌లో బరిలోకి దిగిన మేరి 5-0 తేడాతో మాలా రాయ్(నేపాల్)పై అలవోక విజయం సాధించింది. కర్మబీర్ నబిన్ చంద్ర బోర్డోలోయ్ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న టోర్నీలో అభిమానుల ఈలలు, కేరింతలతో బౌట్‌లోకి ప్రవేశించిన మేరి ఆది నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్‌లతో చెలరేగింది. పంచ్‌లకు తోడు జాబ్స్, హుక్స్‌తో చెలరేగుతూ నేపాల్ బాక్సర్‌ను మట్టికరిపించింది. 51కిలోల మరో క్వార్టర్స్‌లో రాష్ట్ర స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0తో అనామికపై అలవోక విజయం సాధించి సెమీస్‌లో మేరికోంతో పోరుకు సిద్ధమైంది. అనామికపై పంచ్‌ల వర్షం కురిపించిన నిఖత్ తనకు తిరుగులేదని చాటిచెప్పింది. దక్షిణాసియా క్రీడల్లో మేరికోం చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో జరీన్ కనిపిస్తున్నది.

316

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles