సెలెక్టర్ పదవికి మార్క్‌వా రాజీనామా


Wed,May 16, 2018 01:02 AM

mark-waugh
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సెలెక్టర్ పదవికి మాజీ కెప్టెన్ మార్క్‌వా మంగళవారం రాజీనామా చేశాడు. వాస్తవానికి ఆగస్టు 31 వరకు సెలెక్షన్ కమిటీలో కొనసాగేందుకు మార్క్‌వాకు అవకాశముంది. కానీ ఫాక్స్ స్పోర్ట్స్ ప్రసార సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మార్క్‌వా తన పదవిని పొడిగించుకునేందుకు మొగ్గుచూపలేదు. అయితే రానున్న ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనలకు సహచర సెలెక్టర్లు ట్రెవర్ హాన్స్, గ్రెగ్‌చాపెల్, కోచ్ జస్టిన్ లాంగర్‌తో కలిసి కొనసాగనున్నాడు. తన పదవికి రాజీనామాపై స్పందిస్తూ సెలెక్టర్లు, సహాయక సిబ్బంది, ఆటగాళ్లతో కలిసి గత నాలుగేండ్ల నుంచి కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియా జట్టు సాధించిన విజయాల పట్ల గర్వంగా ఉంది. ఆసీస్ క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్ ఉంది. అద్భుత ప్రతిభ కల్గిన యువ క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. రానున్న కాలంలో ఆసీస్ మరింత ఎత్తుకు ఎదుగుంది అని మార్క్‌వా అన్నాడు. ఇదిలా ఉంటే రాజీనామా చేసిన మార్క్‌వాకు బదులుగా సీఏ ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు.

521

More News

VIRAL NEWS