టాప్‌లోనే మందన


Tue,February 19, 2019 01:25 AM

దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ క్రికెటర్ స్మృతి మందన హవా కొనసాగుతున్నది. సోమవారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మందన 774 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌ను ఏలుతున్నది. భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్(709) ఐదో ర్యాంక్‌లో ఉంది. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జులన్ గోస్వామి(685) మూడో ర్యాంక్‌లో ఉండగా, దీప్తిశర్మ(635), పూనమ్ యాదవ్(634) వరుసగా ఎనిమిది, తొమ్మిది ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో దీప్తిశర్మ(397) మూడో ర్యాంక్‌లో ఉంది.

235

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles