మజారే మహీ..


Thu,November 7, 2019 03:09 AM

Maheshwari
జాతీయ జూనియర్ రికార్డు బద్దలు కొట్టిన తెలంగాణ అథ్లెట్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ క్రీడా ప్రతినిధి: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ అథ్లెట్ మహేశ్వరి జాతీయ జూనియర్ రికార్డు బద్దలు కొట్టింది. గుంటూరు వేదికగా బుధవారం జరిగిన పోటీల్లో మహేశ్వరి బాలికల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ విభాగంలో స్వర్ణం (10 ని. 34.10 సెకన్లలో) నెగ్గడంతో పాటు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును మెరుగుపరిచింది. గతంలో దీప్తి 10 నిమిషాల 46.81 సెకన్లలో ఈ ఫీట్ సాధించగా.. ఇప్పుడు 12.71 సెకన్లతో దాన్ని మెరుగుపరిచింది. తెలంగాణకు చెందిన మరో స్ప్రింటర్ జే దీప్తి బాలికల 200 మీటర్ల విభాగంలో రజతం గెలుచుకుంది. ఇప్పటికే ఈ చాంపియన్‌షిప్ 100 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన దీప్తి.. తాజాగా 24.67 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలుర 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలబోతు షణ్ముగ శ్రీనివాస్ 21.34 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మీట్ రికార్డు నెలకోల్పాడు.

171

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles