జోష్న ముందుకు..


Sat,April 13, 2019 02:05 AM

joshna
మకావ్: మూడోసీడ్ జోష్న చినప్ప.. మకావ్ ఓపెన్ స్కాష్ టోర్నీలో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో జోష్న 11-8, 11-2, 11-9తో ఐదోసీడ్ మేయర్ హనే (ఈజిప్టు)పై గెలిచింది. తొలిరౌండ్ బై లభించిన జోష్న.. రెండోరౌండ్‌లో 11-5, 11-8, 11-9తో అమండా లాండ్రెస్ ముర్ఫీ (న్యూజిలాండ్) పై నెగ్గింది. కివీ ప్లేయర్ బలహీనతలపై దృష్టిపెట్టిన జోష్న.. వ్యాలీలు, సర్వీస్‌లతో చెలరేగింది. పురుషుల విభాగంలో రెండోసీడ్ సౌరవ్ ఘోషాల్‌కు చుక్కెదురైంది. ఆరోసీడ్ జార్జ్ లోబన్ (స్కాట్లాండ్) 6-11, 11-8, 11-5, 11-8తో సౌరవ్‌పై గెలిచాడు. అంతకుముందు జరిగిన రెండోరౌండ్‌లో సౌరవ్ 9-11, 11-7, 10-12, 11-2, 11-9తో మహేశ్ మంగ్నోకర్‌ను ఓడించాడు. 77 నిమిషాల మారథాన్ మ్యాచ్‌లో సౌరవ్ అంచనాలకు అనుగుణంగా రాణించాడు. కోపాన్ని అనుచుకోలేకపోయిన మహేశ్ రాకెట్‌ను గోడకేసి కొట్టాడు.

122

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles