మెస్సీ ఆరోసారి బాపూన్ డీ ఓర్ అవార్డు కైవసం


Wed,December 4, 2019 02:04 AM

Lionel-Messi
ప్యారిస్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మైదానంలో తన ఆటతీరులోనే కాదు అవార్డుల వేటలోనూ దిగ్విజయంగా దూసుకెళుతున్నాడు. ప్రతిష్ఠాత్మక బాలెన్ డీ ఓర్ అవార్డును ఏకంగా ఆరోసారి దక్కించుకుని మెస్సీ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి కన్నుల పండువగా జరిగిన అవార్డుల కార్యక్షికమంలో మెస్సీ పురస్కారంతో మెరిసిపోయాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో అవార్డు స్వీకరించిన మెస్సీ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘సరిగ్గా పదేండ్ల క్రితం పారిస్‌లో తొలిసారి బాలెన్ డీ ఓర్ అవార్డు గెలుచుకున్నా. నాకు ఇంకా ఇప్పటికీ గుర్తు అప్పుడు నా ముగ్గురు సోదరులతో కలిసి వచ్చాను. నాలో ఇంకా ఆట మిగిలే ఉంది. ఇంకా కొన్నేండ్లు ఫుట్‌బాల్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నా వయసు గురించి తెలుసు. ఇన్నేండ్ల నా కెరీర్‌ను పూర్తిగా ఆస్వాదించాను. భవిష్యత్తులోనూ ఇదే రీతిలో అభిమానులను వీలైనంత అలరించాలనుకుంటున్నా’ అని 32 ఏండ్ల మెస్సీ అన్నాడు.

168

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles