300 ఐపీఎల్ పాస్‌లు కావాలంటూ లేఖ


Mon,May 13, 2019 02:43 AM

చిక్కుల్లో రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి
హైదరాబాద్: ఐపీఎల్‌కు ఉన్న ఆదరణ ఏంటో అందరికీ తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొందరు డబ్బులు వెచ్చించి మ్యాచ్‌ను ఆస్వాదిస్తే..మరికొందరు మాత్రం తమ పరపతి ఉపయోగించుకుని స్టేడియంలో ఎంజాయ్ చేయాలని చూస్తారు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే.. రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీనియర్ అధికారి కే ప్రదీప్ రావు. అవును ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై, ముంబైల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న మేడ్చల్ జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ప్రదీప్‌రావు చిక్కుల్లో పడ్డాడు. ఫైనల్ మ్యాచ్ కోసం ఏకంగా 300 టిక్కెట్లు కావాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) సీఈవోకు ఈనెల 9న తన అధికారిక సంతకం, ముద్రతో లేఖ రాశాడు. 300 టిక్కెట్లలో 50 కార్పొరేట్ బాక్స్, 250 ప్రివిలేజ్ పాస్‌లు కావాలంటూ ప్రదీప్‌రావు లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు. కాంప్లిమెంటరీ టిక్కెట్ల విషయంలో కమర్షియల్ టాక్సెస్, ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌ను సంప్రదించగా..ప్రదీప్‌రావు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని పేర్కొన్నారు. టిక్కెట్ల కోసం హెచ్‌సీఏకు ప్రదీప్‌రావు లేఖ రాసినట్లు తెలిసింది. తొలుత అతనికి మెమో జారీ చేశాం అని సోమేశ్ కుమార్ అన్నారు.

255

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles