క్వార్టర్స్‌లో లక్ష్యసేన్


Fri,March 15, 2019 12:32 AM

న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్యసేన్.. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్ చేరాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 104వ ర్యాంకర్ లక్ష్యసేన్ 21-14, 21-15తో హ యంగ్ వుంగ్ (దక్షిణ కొరియా)పై గెలిచాడు. 46 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు.. వరుస గేమ్‌ల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపెట్టాడు. నియంత్రణతో కూడిన షాట్ల తో పాటు నెట్ వద్ద మెరుగైన డ్రాప్స్ వేస్తూ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్... జోహ్ జెక్వీ (చైనా) తో తలపడతాడు.

170
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles