మలింగ వేధించాడు..


Fri,October 12, 2018 12:16 AM

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మీటూ తాజాగా పాత్రికేయ, క్రీడారంగాలనూ కుదిపేస్తున్నది. ఇప్పటికే ముంబైకి చెందిన ఏ ఎయిర్ హోస్టెస్ అర్జున రణతుంగ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించగా.. గురువారం శ్రీలంక సూపర్ పేసర్ లసిత్ మలింగ కూడా ఈ జాబితాలో చేరాడు. తన పేరు బయటపెట్టకుండా మలింగ తనపై చేసిన వేధింపులను బయటపెట్టాలంటూ గాయని చిన్మయిశ్రీపాదను ఓ బాధితురాలు ఆశ్రయించింది. దీంతో తన ట్విట్టర్ ఖాతా ద్వారా సదరు మహిళ చెప్పిన విషయాలను చిన్మయి వెల్లడించింది.
malinga
నా వివరాలు బయటకు రావాలని కోరుకోవడం లేదు. కొన్నేండ్ల కిందట ముంబైలోని హోటల్‌లో నా స్నేహితురాలి కోసం ఎదురుచూస్తున్నాను. అదే హోటల్‌లో ఐపీఎల్ కోసం మలింగ బస చేశాడు. నాగురించి ఎలా తెలిసిందో నీ స్నేహితురాలు నా గదిలో ఉందంటూ నాకు చెప్పడంతో నేను మలింగ గదికి వెళ్లాను. అప్పుడు నన్ను వెనకనుంచి పట్టుకుని మంచంపైకి తోశాడు. నేను అతన్ని నిలువరించలేకపోయాను. నా అరుపులతో హోటల్ సిబ్బంది రావడంతో నన్ను వదిలాడు. నాకు చాలా అవమానంగా అనిపించింది. నేను మొహం కడుక్కుని అక్కడినుంచి వెళ్లాను. ఈ విషయాన్ని బయట చెబితే నీవు ప్రచారంలోకి రావడానికే మలింగ గదిలోకి వెళ్లావన్నారు అని సదరు బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయంపై ఇంకా మలింగకానీ రణతుంగ స్పందించకపోవడం గమనార్హం.

250

More News

VIRAL NEWS