డచ్ విజేత లక్ష్యసేన్


Mon,October 14, 2019 01:38 AM

LAKSHYA-SEN
అల్మెరె (నెదర్లాండ్): భారత యువ షట్లర్ లక్ష్యసేన్ అద్వితీయ ఆటతీరుతో డచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. వరుస విజయాలతో ఫైనల్ చేరిన 18 ఏండ్ల లక్ష్య ఆదివారం జరిగిన తుదిపోరులో 15-21, 21-14, 21-15తో యుసుకె ఒండెరా (జపాన్)పై గెలిచి విజేతగా నిలిచాడు. జూనియర్ స్థాయిలో మెరుపులు మెరిపించి యూత్ ఒలింపిక్స్‌లో రజతం, ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన లక్ష్యసేన్ సీనియర్ స్థాయిలోనూ అదే జోరు కనబర్చాడు. గత నెలలో బెల్జియం ఓపెన్ నెగ్గిన లక్ష్యసేన్‌కు కెరీర్‌లో ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్. తొలి గేమ్ కోల్పోయి వెనుకబడిన ప్రపంచ 72వ ర్యాంకర్ లక్ష్యసేన్.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి మ్యాచ్‌ను తన పేరిట రాసుకున్నాడు. 63 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ మినహా లక్ష్యసేన్ సాధికారికంగా కనిపించాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగుతూ తొలి మెగా టైటిల్ ఒడిసిపట్టాడు.

171

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles