ఫైనల్లో లక్ష్యసేన్


Sun,October 13, 2019 12:22 AM

lakhya-sen
అల్మెరె (నెదర్లాండ్స్): భారత యువ షట్లర్ లక్ష్యసేన్ డచ్ ఓపెన్‌లో జోరు కనబరుస్తున్నాడు. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్-100 టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21-12, 21-9తో ఫెలిక్స్ (స్వీడన్)పై అలవోకగా గెలుపొందాడు. 33 నిమిషాల్లో ముగిసిన పోరులో వరుస గేమ్‌ల్లో విజృంభించిన లక్ష్య.. ఆదివారం జరుగనున్న ఫైనల్లో యుసుకె ఒండెరా (జపాన్)తో తలపడనున్నాడు. ఇటీవల బెల్జియం ఓపెన్ చేజిక్కించుకున్న లక్ష్యసేన్.. గతేడాది యూత్ ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గడంతో పాటు వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం కైవసం చేసుకున్నాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-9, 21-16తో భారత్‌కే చెందిన రాహుల్ భరద్వాజ్‌పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాడు.

196

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles