134 పరుగులు, 8 వికెట్లు


Sun,August 25, 2019 01:49 AM

Gowtham

-కేపీఎల్‌లో గౌతమ్ సంచలన ప్రదర్శన

బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో యువ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. బ్యాటింగ్‌లో సూపర్ సెంచరీ (56 బంతుల్లో 134 నాటౌట్; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) బాదడంతో పాటు.. బౌలింగ్‌లో 15 పరుగులే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. లీగ్‌లో భాగంగా బల్లారి టస్కర్స్ తరఫున బరిలో దిగిన గౌతమ్ వేగవంతమైన శతకంతో పాటు.. టోర్నీలో అత్యధిక స్కోరును తన పేరిట రాసుకున్నాడు. 39 బంతుల్లోనే సెంచరీ కొట్టిన గౌతమ్ బౌండరీల ద్వారానే 106 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌కు అధికారిక టీ20 గుర్తింపు లేకపోవడంతో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో గౌతమ్ పేరు రికార్డుల్లోకెక్కలేదు. కృష్ణప్ప విజృంభించడంతో మొదట బ్యాటింగ్ చేసిన బల్లారి జట్టు 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షిమోగా లయన్స్ 133 రన్స్‌కే ఆలౌటైంది. ఫలితంగా బల్లారి జట్టు 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున గౌతమ్ కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

827

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles