టర్నింగ్ బంతులను ఆడలేడు!


Fri,April 12, 2019 02:16 AM

Russel

-రస్సెల్ బలహీనతను బయటపెట్టిన కుల్దీప్

కోల్‌కతా: ఈ సీజన్‌లో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన రస్సెల్.. కోల్‌కతాకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడు. ఎలాంటి బౌలరైనా.. ఎంత లక్ష్యమైనా.. రస్సెల్ క్రీజులో ఉంటే చాలు గెలుపుపై ధీమాగా ఉండొచ్చనే అంచనాలు కూడా పెరిగాయి. అయితే రస్సెల్ బాదుడు వెనుక కారణాలు ఎలా ఉన్నా.. అతని బలహీనతలను మాత్రం ఆ జట్టు ఆటగాడు కుల్దీప్ యాదవ్ బయటపెట్టాడు. బంతిని ఎక్కువగా టర్న్ చేస్తే రస్సెల్ ఆడలేడని స్పష్టం చేశాడు. బంతిని ఎక్కువగా స్పిన్ చేస్తే రస్సెల్ ఇబ్బందిపడతాడు. ఇదే అతని అతిపెద్ద బలహీనత. ఇదొక్కటే కాదు.. వరల్డ్‌కప్‌లో అతన్ని కట్టడి చేసేందుకు నా వద్ద చాలా అస్ర్తాలు ఉన్నాయి. సరైన రీతిలో యార్కర్లు వేసినా రస్సెల్ తడబడతాడు అని కుల్దీప్ పేర్కొన్నాడు. రస్సెల్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నా.. ఇప్పటివరకు నెట్స్‌లో అతనికి బౌలింగ్ చేయలేదన్నాడు. స్పిన్ బౌలింగ్‌లో షాట్లు కొట్టేందుకు రస్సెల్ సాహసం చేయడని, అదే పేస్ బౌలింగ్‌లో అయితే అరవీర భయంకరంగా చెలరేగుతాడన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు వికెట్లే తీసినా.. తాను బౌలింగ్ బాగానే వేస్తున్నానన్నాడు. ఒకవేళ నేను వికెట్లు తీయకపోతే బౌలింగ్ బాగా వేయనట్లు కాదు. పరిణతితో కూడిన క్రికెట్ ఆడుతున్నా. వ్యక్తిగతం కంటే జట్టు ప్రయోజనాలే ఎక్కువ. వికెట్లు దక్కకపోయినా పరుగులు నిరోధిస్తే చాలు. ఈ క్రమంలో జట్టు గెలిస్తే అంతకంటే సంతృప్తి ఏముంటుంది అని కుల్దీప్ వ్యాఖ్యానించాడు.

482

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles