పొలార్డ్‌కు జరిమానా


Tue,May 14, 2019 01:10 AM

kiron
హైదరాబాద్: ముంబై ఇండియన్స్ హార్డ్‌హిట్టర్ కీరన్ పొలార్డ్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఆదివారం హైదరాబాద్ వేదికగా చెన్నైతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్లతో అమర్యాదకరంగా ప్రవర్తించిన పొలార్డ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. డ్వేన్ బ్రావో వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వైడ్ ఇవ్వకపోవడంపై అసంతృప్తికి గురైన పొలార్డ్ బ్యాట్‌ను గాల్లోకి విసిరాడు. ఆ తర్వాత బ్రావో బంతి వేయడానికి వస్తున్నప్పుడు పిచ్‌ను వదిలేసి బయటికి రావడంతో అంపైర్ డెడ్‌బాల్‌గా ప్రకటించారు. ఫీల్డ్ అంపైర్లు నితిన్ మీనన్, ఇయాన్ గౌల్డ్ కలుగజేసుకుని పొలార్డ్‌తో మాట్లాడి మ్యాచ్‌ను కొనసాగించారు. అయితే ఐపీఎల్ ప్రవర్తన నియామవళి ప్రకారం ఈ ముంబై బ్యాట్స్‌మన్ లెవల్-1 తప్పిదానికి పాల్పడినట్లు తేలింది. ఈ విషయంలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్‌దే తుది నిర్ణయం కాగా ఎవరైనా దీనికి కట్టుబడి ఉండాల్సిందేనని ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు.

343

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles