చెస్‌లో రాష్ర్టానికి పతకాల పంట


Thu,September 12, 2019 04:49 AM

chess
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: పశ్చిమాసియా యూత్, జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు పతకాల పంట పండిచారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన టోర్నీలో అండర్-12 బ్లిట్జ్ విభాగంలో మాస్టర్ షేక్ సుమేర్ ఆర్ష్ కాంస్య పతకంతో మెరిశాడు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గాను సుమేర్ ఆరు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. బాలికల విభాగంలో గంటా కీర్తి(7.5) పసిడి పతకం సాధించగా, జాహ్నవి శ్రీ లలిత(6.5)కు కాంస్యం దక్కింది. అండర్-20 ఓపెన్ విభాగంలో ఇంటర్నేషనల్ మాస్టర్ పీ రాహుల్ శ్రీవాత్సవ(7.5) స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అండర్-14 బాలికల కేటగిరీలో వేల్పుల సరయుకు కాంస్యం లభించింది. అండర్-12 బాలికల క్లాసిక్ విభాగంలో సాయి మహతి(6.5)కి రజత, కీర్తి(6.5) కాంస్యం సొంతం చేసుకున్నారు. అండర్-14 ఓపెన్ క్లాసిక్ కేటగిరీలో కార్తీక్ సాయి(7) రజతం దక్కించుకోగా, ర్యాపిడ్ విభాగంలో వేల్పుల సరయు(5) కాంస్యం అందుకుంది.

114

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles