రాష్ట్ర స్థాయి క్రికెట్‌ విజేత ఖమ్మం


Tue,December 3, 2019 01:21 AM

kmm
భద్రాచలం, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలుర క్రికెట్‌ టోర్నీలో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రంగారెడ్డి జట్టు 12 ఓవర్లలో 6 వికెట్లకు 68 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కారణంగా మ్యాచ్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో టోర్నీలో ఓవరాల్‌ రన్‌రేట్‌ ఆధారంగా నిర్వాహకులు ఖమ్మం జట్టును విజేతగా ప్రకటించారు. అంతకుముందు జరిగిన వేర్వేరు సెమీఫైనల్లో నల్లగొండ, హైదరాబాద్‌ పరాజయం పాలయ్యాయి. విజేతలకు టోర్నీ నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు.

136

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles