కేరళ-ఒడిశా మ్యాచ్ డ్రా


Fri,November 8, 2019 11:57 PM

isl
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ, ఒడిశా ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన పోరు నిర్ణీత సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోవడంతో.. చివరకు మ్యాచ్ 0-0తో డ్రా అయింది. రెండు జట్ల కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో మ్యాచ్‌లో మజా లేకుండా పోయింది. జైరా రోడ్రిగ్స్, రాఫెల్ బౌలీ, అరిడానె సాంటనా గాయాలతో తొలి అర్ధభాగంలోనే మైదానం నుంచి తప్పుకోవడంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఫస్ట్‌హాఫ్‌లో కేరళా జట్టుకు గోల్ చేసే అవకాశాలు దక్కినా.. ఫినిషింగ్ లోపంతో ఆ జట్టు ఖాతా తెరువలేకపోయింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

79

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles