రాష్ట్ర బాస్కెట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా ఖాజావలి


Tue,May 14, 2019 01:04 AM

KPHB
కేపీహెచ్‌బీ కాలనీ: రాష్ట్ర బాస్కెట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన షేక్ ఖాజావలి ఎంపికయ్యాడు. కోయంబత్తూర్(తమిళనాడు)లో ఈనెల 14 నుంచి 21 వరకు జరుగనున్న జాతీయ యూత్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఖాజావలి సారథిగా వ్యవహరించనున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన షేక్ ఖాజావలి ఎంపిక కావడంతో బాస్కెట్‌బాల్ కోచ్ అంజిబాబు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. నిలకడైన ప్రదర్శనతో జాతీయ బాస్కెట్‌బాల్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ పట్టుదలతో బాస్కెట్ బాల్‌లో రాణిస్తున్న ఖాజావలి రాష్ర్టానికి మరింత పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా అంజిబాబు అన్నారు.

161

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles