తమిళనాడుదే విజయ్ హజారే

Tue,March 21, 2017 12:32 AM

న్యూఢిల్లీ: తమిళనాడు చేతిలో బెంగాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సోమవారం జరిగిన విజయ్‌హజారే టోర్నీ ఫైనల్లో బెంగాల్‌పై 37 పరుగుల తేడాతో తమిళనాడు విజయం సాధించింది. దీంతో తమిళనాడు ఖాతాలో ఓవరాల్‌గా ఐదో టైటిల్ చేరింది. తొలుత దినేశ్ కార్తీక్(120 బంతుల్లో 112, 14ఫోర్లు) సెంచరీతో తమిళనాడు 47.2 ఓవర్లలో 217 పరుగులు చేసింది. షమీ (4/26)నాలుగు వికెట్లతో అదరగొట్టగా, అశోక్ దిండా(3/36) మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగాల్..45.5 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలింది. సుదీప్ ఛటర్జీ(58)అర్ధసెంచరీ మినహా ఎవరూ రాణించలేకపోయారు. అశ్విన్, మహ్మద్, రాహిల్‌షా రెండేసి వికెట్లు తీశారు. సెంచరీతో రాణించిన కార్తీక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

425

More News

మరిన్ని వార్తలు...