కపిల్ చేతుల్లో కోచ్ ఎంపిక


Thu,July 18, 2019 03:19 AM

Kapil-Dev
న్యూఢిల్లీ: భారత్ కొత్త కోచ్‌ను దిగ్గజ కపిల్‌దేవ్ సారథ్యంలో ని అడ్‌హాక్ కమిటీ ఎంపిక చేయనుంది. అయితే సుప్రీం కోర్టు తర్వాతే కోచింగ్ ప్యానెల్‌పై తుది నిర్ణయం వెలువడనుంది. చీఫ్ కోచ్‌తో పాటు సహాయక బృందం కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మూడు నిబంధనలతో నోటిఫికేషన్ విడుదల చేసిన బీసీసీఐ ఆఖరి గడువును ఈనెల 30 వరకు నిర్దేశించింది. ఇదిలా ఉంటే సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహాదారుల కమిటీ(సీఏసీ) కొనసాగించాలా వద్దా అన్న దానిపై ఎలా ముందుకు వెళ్లాలో సూచించాలంటూ సుప్రీంను సీవోఏ కోరనుం ది. ఈ నేపథ్యం లో సీఏసీ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాని పక్షంలో కపిల్‌దేవ్ సారథ్యంలోని అడ్‌హాక్ కమి టీ కొత్త కోచ్‌ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణంగా సుప్రీం నియమించిన సీవోఏ సభ్యుల్లో తిరిగి విభేదాలు తలెత్తే అవకాశముంది. ఇది వరకే భారత మహిళల క్రికెట్ టీమ్ చీఫ్ కోచ్ డబ్ల్యూవీ రామన్ ఎంపికపై సీవోఏలో చీలిక వచ్చిన సంగతి తెలిసిందే. రామన్ ఎంపిక ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తిరిగి అలా జరుగకుండా జాగ్రత్తలు పాటించే సూచనలు కనిపిస్తున్నాయి.

626

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles