ఆ క్రీడాకారుడి వేధింపులకే రిటైరయ్యా!


Thu,October 11, 2018 01:09 AM

గుత్తా జ్వాల సంచలన ఆరోపణ
jwala-guttaహైదరాబాద్: దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో ట్రెడింగ్‌గా మారిన మీటూ హ్యాష్‌టాగ్ గురించి మాట్లాడుతూ తన కెరీర్‌లో సూపర్ ఫాంలో ఉన్నదశలోనూ ఓ క్రీడాకారుడు మెంటల్ హరాష్‌మెంట్(మానసిక వేధింపులు) చేశాడని సంచలనం విషయం వెల్లడించింది. బుధవారం ఇందుకు సంబంధించిన విషయాన్ని వెల్లడించింది.2006 వరకు జాతీయజట్టులో ఉన్నాడు. 2006లో ఆ సదరు వ్యక్తి చీఫ్ కోచ్‌గా మారాక నన్ను జట్టు నుంచి తొలిగించాడు. జాతీయ చాంపియన్‌గా ఉన్న నన్ను జాతీయజట్టు నుంచి అకారణంగా తప్పించాడు. రియో ఒలింపిక్స్ తర్వాత కూడా ఇదే తరహాలో జట్టునుంచి ఉద్వాసనకు గురయ్యాను.నేను బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ కావడానికి ఆ క్రీడాకారుడి వేధింపులే కారణం అంటూ గుత్తా జ్వాల ఆరోపించింది.

జ్వాలకు సింధు మద్దతు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మీటూ ఉద్యమానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మద్దతు పలికింది. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన వొడాఫోన్ సఖి సేవల ప్రారంభోత్సవంగా సదర్భంగా మాట్లాడింది.తమపై జరిగిన లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెడుతున్నందుకు వారికి అభినందనలు. ఈ సమయంలో వారిని గౌరవించడం నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది అని మహిళలకు సంబంధించిన సఖి సేవల ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపింది. బ్యాడ్మింటన్ మాజీ డబుల్స్ షట్లర్ గుత్తాజ్వాల మానసిక వేధింపులు చేసిన క్రీడాకారుడు తన కెరీర్ ముగింపునకు కారణమయ్యాడని ఆరోపించింది. అందరూ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తుండగా మానసిక వేధింపుల ఆరోపణలతో ప్రముఖ కోచ్ పేరు వెల్లడించకుండా వేధించాడని ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ తనపై ఎవరూ వేధింపులకు పాల్పడలేదని, మానసిక వేధింపులకు గురైన గుత్తా జ్వాలకు మద్దతు ప్రకటించింది.

277

More News

VIRAL NEWS