జూడో చాంప్ వరంగల్


Mon,November 11, 2019 03:27 AM

knr
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రం సాయి మానేరు స్కూల్‌లో జరుగుతున్న 6వ రాష్ట్రస్థాయి జూనియర్స్ జూడో పోటీలు ఆదివారంతో ముగిసాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పురుషుల విభాగంలో వరంగల్ క్రీడాకారులు అత్యధిక పతకాలతో చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. మహిళల కేటగిరీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. లక్నోలో డిసెంబర్ 1 నుంచి 5 వరకు జరిగే జాతీయస్థాయి జూడో పోటీల్లో వీరు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, నిర్వాహకులు అనంతరెడ్డి, జనార్దన్, డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్, రమేశ్ రెడ్డి, మహ్మద్ కరీం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

113

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles